– ముఖ్య నేతలు, కూనంనేని, సీపీఐ(ఎం) అభ్యర్థుల నామినేషన్ల దాఖలు
నవతెలంగాణ- విలేకరులు
నామినేషన్ల ప్రక్రియలో భాగంగా బుధవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు వేశారు. మంత్రి మల్లారెడ్డి, సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క, సీపీఐ(ఎం) అభ్యర్థులు కారం పుల్లయ్య, మాచర్ల భారతి తదితరులు నామినేషన్లు వేశారు.
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం బీఎస్‌ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి, మధిరలో కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క తరపున పార్టీ సీనియర్ నాయకులు నాగభూషణం నామినేషన్ దాఖలు చేశారు. సత్తుపల్లిలో సీపీఐ(ఎం) నుంచి మాచర్ల భారతి, కాంగ్రెస్ నుంచి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ నామినేషన్లు వేశారు. కొత్తగూడెం నుంచి ఎర్రా కామేశ్వర్(బీఎస్‌పీ), కూనంనేని సాంబశివరావు (సీపీఐ), భద్రాచలం నియోజ కవర్గం కుంజా ధర్మారావు (బీజేపీ), కారం పుల్లయ్య సీపీఐ(ఎం) నామినేషన్లు దాఖలు చేశారు. అశారావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి జారే ఆదినారాయణ నామినేషన్ వేశారు.
భూపాలపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు, బీజేపీ అభ్యర్థి కీర్తిరెడ్డి, వరంగల్ తూర్పులో బీఆర్‌ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్, వర్ధన్నపేటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఆర్ నాగరాజు, బీజేపీ తరపున కొండేటి శ్రీధర్ నామినేషన్ వేశారు. ములుగులో కాంగ్రెస్ అభ్యర్థి ధనసరి అనసూయ సీతక్క, మహబూబాబాద్‌లో బీఆర్‌ఎస్ తరపున శంకర్‌నాయక్, కాంగ్రెస్ తరపున భూక్య మురళినాయక్, నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, డోర్నకల్‌లో బీఆర్‌ఎస్ నుంచి రెడ్యానాయక్ నామినేషన్లు దాఖలయ్యాయి.
సూర్యాపేట జిల్లా కోదాడలో బీఆర్‌ఎస్ నుంచి బొల్లం మల్లయ్య యాదవ్ రెండు సెట్లు, సూర్యాపేటలో బీఎస్పీ నుంచి వట్టే జానయ్య నామినేషన్ వేశారు. భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్‌రెడ్డి, బీజేపీ నుంచి గూడూరు నారాయణరెడ్డి, ఆలేరులో బీర్ల ఐలయ్య (కాంగ్రెస్), గొంగిడి సునీత (బీఆర్‌ఎస్) నామినేషన్ వేశారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్‌ఎస్ నుంచి శేరిలింగంపల్లి అభ్యర్థి అరికెపూడి గాంధీ, పరిగి అభ్యర్థి మహేశ్‌రెడ్డి, వికారాబాద్ అభ్యర్థి ఆనంద్, తాండూర్ నుంచి రోహిత్‌రెడ్డి నామినేషన్ వేశారు. కాంగ్రెస్ నుంచి మహే శ్వరం అభ్యర్థి కేఎల్‌ఆర్, పరిగి రామ్మోహన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, రాజేంద్రనగర్ నుంచి కస్తూరి నరేందర్, షాద్‌నగర్ నుంచి వీర్లపల్లి శంకర్ నామి నేషన్ వేశారు. చేవెళ్ల నుంచి కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థిగా నియోజకవర్గ సీనియర్ నాయ కులు సన్నపు వసంతం నామినేషన్ వేశారు.
బీఆర్‌ఎస్ మేడ్చల్ నియోజకవర్గ అభ్యర్థి మల్లారెడ్డి కీసర ఆర్డీఓ కార్యాల యంలో నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ అభ్యర్థి తీగుల్ల పద్మారావుగౌడ్, కాంగ్రెస్ అభ్యర్థి అదం సంతోష్ నామినేషన్ వేశారు. బీఆర్‌ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దానం నాగేందర్ రెండు సెట్ల నామినేషన్లను వేశారు. బీజేపీ నుంచి సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి మర్రి శశిధర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
కామారెడ్డి నియోజకవర్గం నుంచి రేవంత్‌రెడ్డి నామినేషన్‌ను మాజీ మంత్రి షబ్బీర్‌అలీ దాఖలు చేశారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో స్పీకర్ పోచారం నామినేషన్ వేశారు.