
– జీవోను రద్దు చేస్తూ కేసులు ఎత్తివేయాలని డిమాండ్
నవతెలంగాణ – గంగాధర
పవర్ లూమ్స్ గుడ్డ ఉత్పత్తులపై జులుం ప్రదర్శిస్తున్న చేనేత, జౌళిశాఖ విజిలెన్స్ అధికారుల తీరును నిరసిస్తూ గంగాధర మండలం గర్షకుర్తి గ్రామంలోని పవర్ లూమ్స్ వ్యాపారు, కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి రాస్తారోకోని చేపట్టారు. పవర్ లూమ్స్ వస్త్ర వ్యాపారులు, కార్మికుల మనుగడ దెబ్బతీసేలా కలర్ చీరల ఉత్పత్తులపై తీసిన జీవోను వెంటనే రద్దు చేయాలని, మరమగ్గాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ గ్రామంలో భారీ తీసి ప్రధాన చౌరస్తాపై బైటాయించి నిరసన చేపట్టారు. సాంచెలపై నడిపే గుడ్డ ఉత్పత్తును కోసేసి పవర్ లూమ్ కార్మికుడిపై నమెాదు చేసిన కేసును ఎత్తి వేయాలని నేత కార్మికులు డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ప్లే కార్డులను ప్రదర్శిస్తూ కలర్ చీరల ఉత్పత్తులపై తీసిన జీవోను రద్దు చేయాలని, కేసులు ఎత్తివేయాలని, విజిలెన్స్ అధికారుల దాడులు ఆపాలంటూ నేత కార్మికులు నినాదాలు చేశారు. గత ప్రభుత్వం కల్పించిన బతుకమ్మ చీరల ఆర్డర్లను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసి నేత కార్మికుల ఉపాధిని దెబ్బ తీసిందని, వస్త్ర పరిశ్రమల మనుగడ దెబ్బ తీనేలా విజిలెన్స్ అధికారులు దాడులకు దిగారని పవర్ లూమ్స్ వ్యాపారులు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. చీరల బతుకమ్మ చీరల తరహాలో గుడ్డ ఉత్పత్తులకు ప్రభుత్వం ఆర్డర్లు కల్పించి పవర్ లూమ్స్ వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఉత్పత్తి చేసి బతుకమ్మ చీరల పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని పవర్ లూమ్స్ వస్త్రోత్పత్తి వ్యాపారుల సంఘం అధ్యక్షుడు అలువాల విఠోభ, ఆ సంఘం నాయకులు అన్నల్ దాస్ శ్రీనివాస్, చిందం సత్యనారాయణ, కార్మిక సంఘం అధ్యక్షుడు గడ్డం నారాయణ డిమాండ్ చేశారు. ఈ నిరసన, ఆందోళన కార్యక్రమంలో గ్రామంలో పవర్ లూమ్స్ వ్యాపారులు, ఆసాములు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.