గంధంగూడలో భారీ చోరీ

గంధంగూడలో భారీ చోరీ– రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఇంట్లో దొంగతనర
– 12 తులాల బంగారం, ల్యాప్‌టాప్‌ అపహరణ
నవతెలంగాణ-గండిపేట్‌
గండిపేట్‌ మండలం బండ్లగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని గంధం గూడలో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఇంట్లో దొంగతనం జరిగింది. 12 తులాల బంగారం, ల్యాప్‌టాప్‌ అపహరించారు. నార్సింగ్‌ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గంధంగూ డాలోని కిష్టారెడ్డి కాలనీకి చెందిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి హరిబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ వెళ్లారు. తిరిగి వచ్చే సారికి ఇంట్లో దొంగతనం జరిగినట్టు గుర్తించారు. వెంటనే నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. నా ర్సింగి సీఐ హరికృష్ణారెడ్డి ఆధ్వర్యంలో క్లూస్‌ టీం ఆధారాలను సేకరించింది. 12 తులాల బంగారం, ల్యాప్‌టాప్‌ చోరీ జరిగింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.