
నవతెలంగాణ – శంకరపట్నం
తాళం వేసి ఉన్న ఇంటిలో గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న నగలను ఎత్తుకెళ్లిన ఘటన వివరాలు స్థానిక ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం శంకరపట్నం మండలం పరిధిలోని మొలంగూర్ గ్రామపంచాయతీ గుడాటి పల్లెకు చెందిన గుర్రం సంజీవరెడ్డి, అతని భార్య విజయ, కరీంనగర్ లో ఉంటున్న తన కుమారుడి ఇంటికి, మనవడి పుట్టిన రోజు వేడుకలకు శక్రవారం వెళ్లారు. శనివారం ఉదయం తన ఇంటికి రావడంతో ,ఇంటి తలుపులు తీసి తాళం పగలగొట్టిన దృశ్యం చూసేసరికి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లో కి వెళ్లి బీువా తాళం పగులగొట్టి వస్తువులన్నీ చిందరవందరగా పడవేసి అందులో ఉన్న రెండు తులాల బంగారం,వెండి ఆభరణాలు ఎత్తుకొని పోయారని కేశవపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా స్థానిక ఎస్సై కొత్తపల్లి రవి కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నట్లు, ఎస్సై తెలిపారు.