– టీ షర్ట్ ఆవిష్కరణ
హైదరాబాద్ : 6వ తెలంగాణ మాస్టర్స్ గేమ్స్ రాష్ట్ర స్థాయి చాంపియన్‌షిప్ పోటీలు జనవరి 6 నుంచి సికింద్రాబాద్‌లోని జింఖాన మైదానంలో జరుగనున్నాయి. అథ్లెటిక్స్‌లో మహిళలు, పురుషుల విభాగాల్లో 30 ప్లస్ నుంచి 90 ప్లస్ వరకు అన్ని వయో విభాగాల్లో పోటీలు ఉంటాయి. తెలంగాణ మాస్టర్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలకు సంబంధించి టీ షర్ట్‌ను మంగళవారం ఆవిష్కరించారు. టీ షర్ట్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాస్టర్స్ గేమ్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆఫీస్‌బేరర్లు కె. రామిరెడ్డి, వై. రామారావు, బి. భాస్కర్‌రావు, బెర్నార్డ్, రత్నాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.