హైదరాబాద్ : 6వ జాతీయ మాస్టర్స్ గేమ్స్ చాంపియన్‌షిప్స్ ఫిబ్రవరి 8 నుంచి ఆరంభం కానున్నాయి. మహిళలు, పురుషుల విభాగాల్లో నేషనల్ చాంపియన్‌షిప్స్‌కు ఈ ఏడాది గోవా వేదిక కానుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి 246 మంది క్రీడాకారులు ఈ పోటీలకు హాజరు కానున్నారు. జాతీయ టోర్నీలో తెలంగాణ అథ్లెట్లు ధరించే జెర్సీ సహా స్పోర్ట్స్ కిట్‌ను హైదరాబాద్ సంయుక్త కలెక్టర్ మధుసూదన్, ఉప కలెక్టర్ వేణు మాధవ్‌లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా మాస్టర్స్ గేమ్స్ వైస్ చైర్మెన్ జగజీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.