మాతా శిశు సంరక్షణ హాస్పిటల్ అందుబాటులోకి తేవాలి 

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ పట్టణంలో  ఏడు కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన  మాత శిశు సంరక్షణ హాస్పిటల్ పూర్తిస్థాయిలో పూర్తి అయిందని వెంటనే హాస్పిటల్ లో అందుబాటులోకి తేవాలని బిఎస్పి పార్టీ ఇంచార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ అన్నారు. శుక్రవారం మాతా శిశు సంరక్షణ హాస్పిటల్ సందర్శించిన నాయకులు మాట్లాడారు హాస్పిటల్ పూర్తయి ఎనిమిది నెలలు గడుస్తుందని  కరెంటు, నీరు, ఫర్నిచర్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినట్టు తెలుస్తుందన్నారు. హాస్పిటల్ ఓపెనింగ్ అయితే  హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, చిగురుమామిడి లోని ప్రజలకు వైద్య పరంగా  గర్భిణీ స్త్రీలకు, చిన్నపిల్లల వైద్యానికి కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ కు వెళ్లకుండా బాధలు తప్పుతాయన్నారు. ప్రజలకు వైద్య ఖర్చులు తగ్గుతాయని వెంటనే హాస్పిటల్ ను ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలగందుల శంకర్, జిల్లా మాజీ అధ్యక్షులు డేగల వెంకటేష్, నియోజకవర్గ అధ్యక్షులు వెలుపుల రాజు పాల్గొన్నారు.