నవతెలంగాణ – భీంగల్ రూరల్
భీంగల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద 127 వ జయంతి వేడుకలు నిర్వహించారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విజయం వెనుక మాతా రమాబాయి పాత్ర ఎంతో కీలకంగా ఉందని, అంబేద్కర్ విదేశాలలో ఉన్నత విద్య కోసం రమాబాయి ఎంతో కృషి చేశారని ఉన్నారు. తమ పిల్లలు అనారోగ్యంతో చనిపోతున్న. ఈ దేశ అణగారిన వర్గాల పీడత ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన,గొప్ప త్యాగశీలి రమాబాయి అని మరోసారి గుర్తు చేశారు. మాతా “రమాభాయి అంబేద్కర్” జయంతి సందర్భంగా ఆ మహానీయురాలికి వినమ్ర పూర్వక వందనాలు తెలిపిన దళిత నాయకులు. ఇట్టి కార్యక్రమంలో బట్టు అనిల్, భీమ రవీందర్, మేకల శ్రీనివాస్, రాహుల్, రమేష్, గుర్రం రాజేశ్వర్, బట్టు సునీల్, గన్న వినయ్, తదితరులు పాల్గొన్నారు.