
– మా వైష్ణో దేవి మాతా జాగరణ్ మండల్
నవతెలంగాణ – సుల్తాన్ బజార్
చైత్ర నవరాత్రుల సందర్భంగా ఈనెల 13 న గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌లో 21 వ మా వైష్ణో దేవి విశాల్ జాగరణను నిర్వహించునున్నట్లు మా వైష్ణో దేవి మాతా జాగరణ్ మండల్, హైదరాబాద్ కోర్ కమిటీ సభ్యులు అంజనీ కుమార్ అగర్వాల్, రాకేష్ నర్సింగ్ పురియా, సంజయ్ అగర్వాల్, ధీరజ్ అగర్వాల్, రామ్ కిషన్ అగర్వాల్, మనీష్ అగర్వాల్, పురుషోత్తం అగర్వాల్, ముకేశ్ అగర్వాల్, రాకేష్ జలాన్, ప్రవీణ్ నవీందర్, సూర్యకమాల్ గుప్తా, అంజాన్ సరావుగి లు తెలిపారు. గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు జాగరణ్ భూమి పూజ, ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం వారు మాట్లాడుతూ.. దైవిక రక్షణను, కుటుంబాలకు ఆశీర్వాదం కోసం మరియు పురాతన సంప్రదాయాల పరిరక్షణలో భాగంగా ప్రేమ, కరుణ, భక్తి మరియు ధర్మం వంటి విలువలు ప్రచారం కోసం గత 20 సంవత్సరాల నుండి హైదరాబాద్ లో మాతా వైష్ణో దేవి విశాల్ జాగరణ్ పెద్దఎత్తున నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల13 న సాయంత్రం ఏడు గంటలకు జమ్మూ లోని మా వైష్ణో దేవి మాతా దేవాలయం ప్రధాన పూజారి బ్రహ్మాహీన్ అమీర్ చంద్ జి పూజారి ఆశీస్సులతో ప్రస్తుత ప్రధాన పూజారి లోకేష్ జి పూజారి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి, మాతా వైష్ణో దేవి విశాల్ జాగరణ్ ను ప్రారంభిస్తారని అన్నారు. మాతా కా జాగరణ్ అనేది ప్రధానంగా భక్తితో కూడిన కార్యక్రమం అని, ఇందులో ప్రముఖ భక్తి గీతాల గాయనీగాయకులు రాజస్థాన్ నుండి ప్రకాష్ మాలి, ఢిల్లీ నుండి కరిస్మా శర్మ, మీనాక్షి శర్మ, హైదరాబాద్ నుండి మురారి దహిమ తదితరులు ఆరాధనలో భాగంగా భజనలు, భక్తి పాటలు ఆలపిస్తారని వెల్లడించారు. దాదాపు 20,000 మంది భక్తులు హాజరవుతారని, వారికి ఉచిత ప్రవేశం, ఫలహారాలు మరియు రాత్రి భోజనం అందజేస్తామని, జమ్మూలోని మా వైష్ణో దేవి మాతా ఆలయం నుండి తెచ్చిన ‘ప్రసాదం’ మరియు ఖజానా నాణేలను జాగరణ సందర్భంగా వచ్చే భక్తులకు ఉచితంగా అందజేస్తామని వారు తెలిపారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ రావు, ఎమ్యెల్యేలు రాజా సింగ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మ రావు గౌడ్, మైనంపల్లి రోహిత్, బీజేపీ హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం అభ్యర్థి మాధవి లతా తదితరులు హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందుతారని, సమాజంలో పండుగ వాతావరణానికి మాతా కా జాగరణ్ దోహదం చేస్తుందని, సంతోషకరమైన భజనలు, భక్తి గానాలు, రంగురంగుల అలంకరణలు, సామూహిక వేడుకలు భక్తిపారవశ్యంలో ముంచెత్తుతాయని, ఈ పవిత్రమైన అవకాశాన్ని ఉపయోగించుకొని భక్తులందరు ఈ మా వైష్ణో దేవి మాతా జాగరణ్ వేలాదిగా పాల్గొనాలని వారు విజ్ఞప్తి.