ఐర్లాండ్‌ మహిళా జట్టుకు మ్యాచ్‌ ఫీజులో కోత

Match fee cut for Ireland women's teamదుబాయ్‌: భారత మహిళలతో జరిగిన వన్డే సిరీస్‌ను కోల్పోయిన ఐర్లాండ్‌ మహిళలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. రాజ్‌కోట్‌ వేదికగా బుధవారం జరిగిన మూడో, చివరి వన్డేలో స్లో-ఓవర్‌ రేట్‌కు గాను 10 శాతం మ్యాచ్‌ ఫీజులో కోత విధిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) తాజాగా వెల్లడించింది. నిర్ణీత సమయం కంటే రెండు ఓవర్లు ఆలస్యంగా వేసినట్లు ఐసిసి గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఐసిసి ప్యానెల్‌ ఆఫ్‌ మ్యాచ్‌ రిఫరీలు జిఎస్‌ లక్ష్మి ఈ విషయాన్ని ఐసిసికి విన్నవించగా.. ఐసిసి తాజా ప్రకటనలో ఆర్టికల్‌ 2.22 ప్రకారం ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో 10శాతం కోత విధిస్తున్నట్లు తెలిపింది. ఒక్కో ఓవర్‌కు 5శాతం చొప్పున మొత్తం 2ఓవర్లకు 10శాతం ఫీజులో కోత విధించినట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ఐర్లాండ్‌ కెప్టెన్‌ గాబీ లూయిస్‌కు తెలియజేయగా ఆమె అందుకు అంగీకారం తెలిపినట్లు ఐసిసి తెలిపింది. మూడో వన్డేకు ఆన్‌ఫీల్డ్‌ అంపైర్లుగా కిమ్‌ కాటన్‌, అక్షర్‌ టోట్రే, మూడో అంపైర్‌గా వీరేంద్ర శర్మ, నాల్గో అంపైర్‌గా బృందా రాఠీఛార్జి వ్యవహరించారు.