ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి.. తల్లీ బిడ్డకు ఆరోగ్యం

– డాక్టర్ అల్లెం అప్పయ్య, డి ఏం అండ్ హెచ్ ఓ ములుగు
నవతెలంగాణ – గోవిందరావుపేట
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి చేయడం ద్వారా తల్లికి బిడ్డకు ఆరోగ్యము కుటుంబానికి ఆర్థిక భారం కూడా తగ్గుతుందని డి ఏం అండ్  హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. మొదటిగా ఇటీవల నిర్మించిన బర్త్ వెయిటింగ్ వార్డుని పరిశీలించి ముందు ఉన్న చెత్తను పిచ్చి మొక్కలను తొలగించాల్సిందిగా వైద్య అధికారి డాక్టర్ చంద్రకాంతిని ఆదేశించడం జరిగింది. తర్వాత ఓపి రిజిస్టర్ ని గర్భిణీ స్త్రీల రిజిస్టర్ అసంక్రమిత వ్యాధుల రిజిస్టర్స్ ని కూడా పరిశీలించి ఈరోజు డెలివరీ డేట్ ఉన్న మౌనిక అనే గర్భిణికి ఫోన్ చేసి డెలివరీ అయింది లేది తెలుసుకోవడం జరిగింది ఆమె అక్క సమాధానం ఇస్తూ మౌనిక అనే గర్భిణి ఈనెల 8వ తారీఖున వరంగల్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్ ద్వారా మగ బిడ్డకు జన్మనిచ్చింది అని తెలుపగా డి ఎం అండ్ హెచ్ ఓ  ఆరోగ్యశాఖ సిబ్బంది నీ ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయించకుండా ఏం చేస్తున్నారని అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నీ సంప్రదించకుండా మీరు ఆత్రుతతో ప్రైవేటు ఆసుపత్రిని సంప్రదించడం జరిగింది ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. దీనివల్ల మీరు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా ఆమెకు ఆపరేషన్ వల్ల ముందు ముందు అనర్థాలు ఏర్పడే అవకాశం ఉందని వివరించడం జరిగింది. దీని దృష్టిలో పెట్టుకొని సంబంధిత సూపర్వైజర్ లక్ష్మిని మందలించగా ఆమెకు మన ఆశలు ఏఎన్ఎంలు చెప్పినప్పటికీ తల్లి ఊరైన వరంగల్ కు వెళ్లారని వివరించారు ఈ నెలలో 14 డెలివరీలు ఉండగా ఇప్పటివరకు మూడు డెలివరీ లు అయినవి అని వైద్యాధికారి వివరించారు డి ఎం ఎం హెచ్ ఓ  కల్పించుకొని వారం రోజుల నుండే గర్భిణీ స్త్రీలకు ఫోన్లు చేసి ముందుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించండి పరిస్థితిని బట్టి ములుగు జనరల్ ఆసుపత్రికి రిఫర్ చేయండి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది తర్వాత ప్రస్తుతమైతే ప్రతి గ్రామములో జరుగుతున్న ఎన్ఆర్జిఎస్ పనుల స్థలాల్లో ఓఆర్ఎస్ ఆశలు పంచుతున్నారు అది ఇంకా ఉదృతం చేసి రావాలని ప్రజలందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రకాంత్ డాక్టర్ అనూష సూపర్వైజర్ లక్ష్మి మరియు స్టాఫ్ నర్స్ ఉన్నారు.