తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం రోజున గణితశాస్త్ర దినోత్సవవేడుకలను ఘనంగా కళాశాల ప్రిన్సిపల్ సయ్యద్ యూసుఫ్ హుస్సేన్ అధ్యక్షతన నిర్వహించారు .ఈ కార్యక్రమంలో గణిత శాస్త్ర అధ్యాపకులు సతీష్ కుమార్ ను కళాశాల విద్యార్థులు అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ గణిత శాస్త్రం యొక్క ప్రాధాన్యత గురించి వివరించారు. ప్రతి విద్యార్థి గణిత శాస్త్రం పై పట్టు సాధించాలని సూచించారు. గణితం చదివిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.