జాతీయ గణిత దినోత్సవాన్నీ పురస్కరించుకుని మండలంలోని కొయ్యుర్ గ్రామంలోని విశ్వదీప్తి ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఘనంగా గణిత దినోత్సవం నిర్వహించినట్లుగా పాఠశాల కరస్పాండెంట్ ఎంకె సుదర్శన్ తెలిపారు.ఈ సందర్భంగా కరస్పాండెంట్ మాట్లాడారు గణిత శాస్త్రం ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించినట్లుగా తెలిపారు.ప్రతి విద్యార్థి గణిత శాస్త్రంపై పట్టు సాధించాలని సూచించారు.గణితంపై ఆసక్తి చూపిన విద్యార్థులకు భవిష్యత్ ఉంటుందన్నారు.అనంతరం గణిత శాస్ర్త ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.