‘మట్కా’ రిలీజ్‌కి రెడీ

'Matka' to the release readyనాలుగు భిన్న గెటప్స్‌తో వరుణ్‌ తేజ్‌ కనిపించనున్న చిత్రం ‘మట్కా’. ఈ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రానికి కరుణ కుమార్‌ దర్శకుడు. తాజాగా మేకర్స్‌ ‘రామ టాకీస్‌..’ అంటూ సాగే ర్యాంప్‌ సాంగ్‌ని రిలీజ్‌ చేశారు. భవానీ రాకేష్‌ అదిరిపోయే బీట్స్‌తో ఈ పాటని కంపోజ్‌ చేశారు. డైరెక్టర్‌ కరుణ కుమార్‌ స్వయంగా రాసిన జానపద సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాయి దేవ హర్ష వోకల్స్‌ ఈ పాటని మరింత ప్రత్యేకంగా నిలిపింది. హీరో వరుణ్‌ తేజ్‌తో పాటు సినిమాలోని కీలక నటీనటులు, స్పెషల్‌ సెట్స్‌, షూటింగ్‌ లోకేషన్స్‌ని ప్రజెంట్‌ చేసిన సాంగ్‌ మేకింగ్‌ వీడియో బిగ్గెస్ట్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. విన్నవెంటనే కనెక్ట్‌ అయ్యే ఈ సాంగ్‌ ఇన్‌స్టంట్‌ చార్ట్‌ బస్టర్‌గా నిలిచింది అని చిత్రయూనిట్‌ తెలిపింది.
మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నవీన్‌ చంద్ర, సలోని, అజరు ఘోష్‌, కన్నడ కిషోర్‌, రవీంద్ర విజరు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కరుణ కుమార్‌, నిర్మాతలు: డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి, సంగీతం: జివి ప్రకాష్‌ కుమార్‌, డీవోపీ: ఎ కిషోర్‌ కుమార్‌, ఎడిటర్‌: కార్తీక శ్రీనివాస్‌ ఆర్‌, సీఈఓ: ఈవీవీ సతీష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఆర్కే జానా, ప్రశాంత్‌ మండవ, సాగర్‌.