మట్టిపల్లి సైదులును గెలిపించాలి

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి
నవతెలంగాణ-మునగాల
నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్న సీపీఐ(ఎం) కోదాడ అభ్యర్థి మట్టిపల్లి సైదులును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మండలకేంద్రంలోని సుందరయ్య భవన్‌లో మండల జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీఆర్‌ఎస్‌,కాంగ్రెస్‌,బీజేపీలను ఎన్నికల్లో ఓడించాలని కోరారు.ఎన్నికలకు ముందు ఆ పార్టీలు ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్నారని విమర్శిచారు.ప్రజా సమస్యల పరిష్కారం కావాలంటే చట్ట సభల్లోకి సీపీఐ(ఎం) అభ్యర్థులను పంపించా లన్నారు.డబ్బులతో ఓట్లను కొనుగోలు చేసే పార్టీలను నమ్మొద్దని హెచ్చరించారు. చట్టసభల్లో కమ్యూ నిస్టులు ఉంటేనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. శాసనసభలో కమ్యూనిస్టులు లేని కారణంగా కార్మికుల,రైతుల, వ్యవసాయ, కార్మికుల,మహిళల,ఉద్యోగ, నిరుద్యోగ యువతి,యువకుల, విద్యార్థుల, చేతివత్తిదారుల, దళిత,గిరిజన, మైనార్టీ ప్రజల సమస్యలు చర్చకు రావడం లేదన్నారు.ప్రజా ఉద్యమాల రధసారథిó అయిన మట్టిపల్లి సైదులును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గసభ్యులు బుర్రి శ్రీరాములు, పార్టీ కోదాడ ఎమ్మెల్యే అభ్యర్థి మట్టిపల్లి సైదులు, జిల్లాకార్యదర్శివర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు దేవరం వెంకటరెడ్డి, మండల కార్యదర్శి చందా చంద్రయ్య, మండల కమిటీ సభ్యులు వీరబోయిన వెంకన్న, బచ్చలకూర స్వరాజ్యం, జూలకంటి కొండారెడ్డి, రేఖ లింగయ్య, దేశిరెడ్డి స్టాలిన్‌ రెడ్డి, జ్యోతి, సతీష్‌, గోపయ్య, ఉపేంద్ర, ఆరే రామకష్ణారెడ్డి,నందిగామసైదులు పాల్గొన్నారు.