బహుజన్ సమాజ్ పార్టీకి అండగా ముస్లిం మైనార్టీ మౌలానా సంఘం..

నవతెలంగాణ- సూర్యాపేట
 పట్టణంలోని పి.యస్.ఆర్ సెంటర్ కు చెందిన ముస్లిం మైనారిటీ మౌలానా సంఘం వారు బహుజన్ సమాజ్ పార్టీ సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్ ని బుధవారం వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు ప్రకటించారు. ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గ ముస్లింలంతా ఏకమై బహుజన్ సమాజ్ పార్టీ కి ఓట్లు వేసి గెలిపిస్తామని హామీ ఇచ్చారు. పట్టణంలో అభివృద్ధి పేరుతో అరాచకాలు చేస్తున్నారని ముస్లిం మైనార్టీలకు మభ్యపెట్టి ఓట్లు వేయించుకుంటున్నారని వారు తెలిపారు. బహుజనులలో మైనార్టీ వర్గం కూడా కీలకమే అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వట్టె జానయ్య యాదవ్ మాట్లాడుతూ  పట్టణంలో ముస్లిం మైనార్టీ సోదరులంతా ఏకమై బహుజన పార్టీని గెలిపించాలని కోరారు. అధికారంలోకి రాగానే మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ రావడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ చాంద్ పాషా, మౌలానా అబ్దుల్ గఫార్, అబ్దుల్ జబ్బర్ రషీదీ, హఫీజ్, అబ్దుల్ హమీద్, మహమ్మద్ గుఫ్రాన్, మైనార్టీ నాయకులు ,బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.