నవతెలంగాణ – రెంజల్
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి గోదావరి త్రివేణి సంగమంలో మౌని అమావాస్యని పురస్కరించుకొని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పుణ్య స్థానాలను ఆచరించారు. కుంభమేళకు వెళ్లలేని వారు త్రివేణి సంగమమైన కందకుర్తి గోదావరిలో పుణ్య స్థానాలను ఆచరించాలన్న తలంపుతో అత్యధిక సంఖ్యలో విచ్చేశారు. భక్తుల పుణ్య స్థానాల అనంతరం ప్రవీణ్ మహారాజ్ ఆధ్వర్యంలో భ క్తులు మా హారతి లో పాల్గొన్నారు. ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడంతో సౌకర్యాలు లేవని భక్తులు వసంతృప్తి వ్యక్తం చేశారు. చెత్తాచెదారంతో నిండుకొని గాట్ల వద్ద మట్టి ఉండడంతో భక్తులకు అసౌకర్యంగా మారింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వారం రోజుల ముందుగానే శుభ్రం చేసినట్లయితే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేదని భక్తులు పేర్కొంటున్నారు. ఇకనుంచైనా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ గోదావరి ప్రధాన ఘట్లను శుభ్రంగా ఉంచాలని వారు కోరుతున్నారు.