– ఎన్నికల కమిషన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
లోకసభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ రోజైన మే 13న వేతనంతో కూడిన సెలవు వర్తిస్తుందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని 17 పార్లమెంటరీ నియోజకవర్గాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రయివేటు సంస్థలు, విద్యాసంస్థల్లో పని చేసే సంఘటిత, అసంఘటిత కార్మికులందరికి ఈ సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 135 బి సెక్షన్ ప్రకారం, సంస్థలు, యాజమాన్యాలు ఉత్వర్వులను ఉల్లంఘించి ఉద్యోగులు, కార్మికులకు వెతనం చెల్లించకుంటే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.