– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలుగుతో పాటు పలు భాషల్లో వేలాది గీతాలు పాడి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన గాయని సుశీల త్వరగా కోలుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు. అనారోగ్యంతో చెన్నైలోని అస్పత్రిలో చికిత్స పొందుతున్న సుశీల సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆదివారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.