
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కేంద్రం లో జరిగిన మహిళల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మడే పూర్ణిమ మాట్లాడుతూ నేను, కాంగ్రెస్ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా దరఖాస్తు చేశాను. కాంగ్రెస్ అధిష్టానం కనీసం నా అభ్యర్థనను పరిశీలించ లేదు మా కుటుంబ సభ్యులు మొదటినుండి కాంగ్రెస్ వాదులము, నేను పార్టీల రంగు మార్చి న దాఖలాలు లేవు నా అభ్యర్థనను పరిశీలించ నందున మనస్తాపానికి గురయ్యాను. కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీలో నిలబడాలని నా అభిమానులు సంఘ మిత్రులు బంధువులు నన్ను వెన్ను తట్టి ధైర్యాన్ని ఇస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అన్నారు. పోటీకి సిద్ధమై మీ ముందుకు వచ్చాను.. నన్ను గెలిపిస్తే ములుగు ను అభివృద్ది చేసి చూపిస్తా ఈ నియోజక వర్గంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను అని పూర్ణిమ తెలిపారు