మాయవతి జన్మదిన వేడుకలు..

నవతెలంగాణ – బెజ్జంకి
మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద బీఎస్పీ మండలాధ్యక్షుడు సావనపల్లి రాజు అధ్వర్యంలో బీఎస్పీ జాతీయ నాయకురాలు కుమారి మాయవతి జన్మదిన వేడుకలు బుధవారం నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. మానకొండూరు నియోజకవర్గాధ్యక్షుడు మాతంగి తిరుపతి,నియోజకవర్గ ఇంచార్జీ నిషాని రాజమల్లు, కోశాధికారి సదానందం, మండల ఉపాధ్యక్షుడు మిట్టపల్లి రామచంద్రం, మండల ప్రధాన కార్యదర్శి నిషాని సురేష్, కార్యకర్త సత్తయ్య పాల్గొన్నారు.