మేడే ను విజయవంతం చేయాలి: సీఐటీయూ ఖలీల్ 

నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
జరగబోయే మేడే ఉత్సవాన్ని  డివిజన్ వ్యాప్తంగా కార్మికులు, కర్షకులు అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకుడు కలిల్ పిలుపునిచ్చారు. ఆదివారం బాన్సువాడ పట్టణ  కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలిల్ మాట్లాడారు. కార్మిక, కర్షకుల హక్కుల సాధన కోసం లాల్ జెండా పోరాటాన్ని గుర్తు చేసుకునే రోజు మేడే అన్నారు. బుధవారం జరగబోయే 138వ ప్రపంచ కార్మిక దినోత్సవం గా మేడే ను డివిజన్ వ్యాప్తంగా కార్మికులు కర్షకులు అభిమానులు ప్రతి గ్రామంలో హాజరై జెండాలను ఎగురవేసి పండగ వాతావరణాన్ని సృష్టించాలని, కార్మికులకు, కర్షకులకు, అభిమానులకు పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 44 చట్టాలను నాలుగు కోడ్లు గావిభజన చేసి కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతుందన్నారు. ఈ సందర్భంగా కార్మికులందరూ ఏకమై పోరాటం చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి పోరాటాల ద్వారా నాలుగు కోడ్ ల ను తిప్పి కొట్టాలన్నారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్ష కార్యదర్శులు బుజ్జి, సాయిలు, మేత రాజు, విఠల్, పెరక శివరాజు తదితరులు పాల్గొన్నారు.