దేవరాజ్‌కు మేయర్‌ సన్మానం

To Devaraj Mayor's Awardహైదరాబాద్‌ : హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) కార్యదదర్శి ఆర్‌. దేవరాజ్‌ను జిహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి సోమవారం సన్మానించారు. 2025 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టుకు దేవరాజ్‌ మేనేజర్‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక ఐసీసీ ఈవెంట్‌లో టీమ్‌ ఇండియా జట్టు బాధ్యతలు చేపట్టనున్న దేవరాజ్‌ను విజయలక్ష్మి అభినందించారు. భారత జట్టు మేనేజర్‌గా హైదరాబాద్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.