ట్రేడ్ లైసెన్స్, నీటి పన్ను పై సమీక్షించిన మేయర్ 

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలోని నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ ఛాంబర్ లో నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మకరంద్ తో కలిసి  ట్రేడ్ లైసెన్స్ నీటి పన్ను పై సమీక్ష సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా మేయర్ దండు నీతూ కిరణ్ అధికారులతో మాట్లాడుతూ.. మున్సిపాలిటీకి రావలసిన బకాయిలను త్వరితగతిన వసూలు చేయాలని, సుధీర్ఘకాలంగా పెండింగ్ లో ట్రేడ్ లైసెన్స్, యూసర్ చార్జెస్, నీటి పన్ను  వసూలుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆధికారులను ఆదేశించారు. ప్రజా అవసరాలను తీర్చటానికి  ప్రజలకు మెరుగైన సదుపాయాలు కలిపించటానికి చేపడుతున్న చర్యలను ప్రజలకు వివరించాలని అన్నారు. ప్రజలు నిర్ణిత గడువులోగా ట్రేడ్ లైసెన్స్, యూసర్ చార్జెస్, నీటి పనులను చెల్లించి మున్సిపల్ అధికారులకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో  అస్సిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్, అకౌంట్ ఆఫీసర్ సుధాకర్, మున్సిపల్ ఇంజనీర్ మురళి మనోహర్, సెక్రెటట్రీ శ్రీపాద రామేశ్వరం, మేనేజర్ జనార్దన్  ఎం.హెచ్.ఓ సాజిద్ అలీ, టౌన్ ప్లానింగ్ అధికారులు, డిప్యూటీ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు, సానిటరీ ఇన్స్పెక్టర్లు  ఇతర అధికారులు పాల్గొన్నారు.