యూనివర్సిటీ హెల్త్ సెంటర్ లో ఎంబీబీస్ డాక్టర్ ను నియమించాలి..

– యూనివర్సిటీ సమస్యలను పరిష్కరించాలి.
– భారతీయ విద్యార్థి మోర్చ రాష్ట్ర కార్యదర్శి జివియం విఠల్ డిమాండ్
నవతెలంగాణ డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీలో హెల్త్ సెంటర్ లో ఎంబిబిఎస్ డాక్టర్ ను నియమించాలని భారతీయ విద్యార్థి మోర్చ బివియం ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరికి శుక్రవారం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా భారతీయ విద్యార్థి మోర్చ రాష్ట్ర కార్యదర్శి (తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థి) జివియం విఠల్ మాట్లాడుతూ హెల్త్ సెంటర్లలో డాక్టర్ లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. జ్వరం వస్తే   అనారోగ్య సమస్యలు వస్తే హెల్త్ సెంటర్ కి వెళ్లితే  అక్కడ సిబ్బంది అందుబాటులో ఉండరని,పేరుకే హెల్త్ సెంటర్ తప్ప కనీస సదుపాయాలు లేవన్నారు.వివిధ టెస్టుల కోసం వెళితే అక్కడ టెక్నీషియన్, పరికరాలు కూడా అందుబాటులో లేవన్నారు.వెంటనే హెల్త్ సెంటర్ లో ఒక్క ఎంబీబీస్ డాక్టర్ ను నియమించాలని,పూర్తి స్థాయి ల్యాబ్ పరికాలను అందుబాటులో ఉంచి ఖాళీగా ఉన్న సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని సూచించారు.నూతన బాలికల వసతి గృహాని ఏర్పాటు చేయాలని, యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఇన్చార్జి సూరజ్, వరుణ్, నాయకులు యోగేష్ తదితరులు పాల్గొన్నారు.