డిచ్ పల్లి విద్యార్థికి ఎంబిబిఎస్ ఓపెన్ కేటగిరిలో సీటు

నవతెలంగాణ- డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలంలోని దేవపల్లి గ్రామానికి చెందిన కాసు భానురావు పద్మావతిల కుమారుడు నీట్ లో 544/720 సాధించి బుధవారం రాష్ట్రస్థాయిలో ఓపెన్ కేటగిరిలో సంగారెడ్డి మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ సీటు సాధించాడు. నితిన్ కుమార్ తండ్రి తెలంగాణ యూనివర్సిటీ లో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. దీంతో మండలానికి చిన్న గ్రామమైన దేవపల్లి గ్రామానికి చెందిన నితిన్ కుమార్ పేరు తెచ్చడాని గ్రామస్తులు తెలిపారు. నితిన్ డిచ్ పల్లి మండలం లోని ఖిల్లా డిచ్ పల్లి మోడల్ స్కూల్  విద్యార్థి కావడం విశేషం. ఈ సందర్భాంగా ఎంబిబిఎస్ సీటు సాధించిన నీతిన్ ను గ్రామస్తులు, బందువులు, స్నేహితులు అభినందించారు.మున్ముందు మంచి నైపుణ్యం ప్రదర్శించి ఉన్నతస్థాయికి చేరుకోవాలని వారు అకంక్షించారు.