నవతెలంగాణ-జన్నారం
మండలంలోని పొనకల్‌కు చెందిన దుమల్ల నాగమణికి ఎంబీబీఎస్ సీటు సాధించింది. నీట్లో రాష్ట్రస్థాయిలో 5864 ర్యాంకు పొంది నిర్మల్ మెడికల్ కాలేజీలో ఆమెకు సీటు వచ్చింది. అలాగే మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన బాణావ వినీత్ కుమార్ 3666 ర్యాంకు సాధించి రామగుండంలోని సింగరేణి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. నాగమణి పొనకల్ వాసి దుమల్ల ఎల్లయ్య, సరిత దంపతుల పెద్ద కుమార్తెనా ఆమె చిన్నప్పటి నుంచిఎంతో చురుగ్గా చదువుకుంటూ మంచి మార్కులు సాధించేది. ఆమె ఒకటి నుంచి 4వ తరగతి వరకు గ్రామంలోని పొనకల్ ప్రాథమిక పాఠశాలలో చదివి, ఆ తర్వాత నిర్మల్ కేంద్రంలోని టీఎస్ఆర్జేసీీ(డబ్ల్యూ)లో 5వ తరగతి నుంచి 10వ తరగతి, ఇంటర్మీడియట్ లక్షెట్టిపేటలోని టీఎస్ఆర్జేసీ(డబ్ల్యూ) చదువుకుంటూ నిట్‌లో ర్యాంకు సంపాదించింది. ఈ మేరుకు కౌన్సిలింగ్ ద్వారా ఎంబీబీఎస్ సీట్లు కేటాయించగా, ఆమెకు నిర్మల్ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. ఈ మండలంలోని చింతగూడకు చెందిన బానావత్ వినీత్ కుమార్ ఎంబీబీఎస్ సీటు సాధించాడు. నీట్ లో రాష్ట్రస్థాయిలో 3666 ర్యాంకు పొంది పెద్దపల్లి జిల్లాలోని రామగుండం సింగరేణి మెడికల్ కాలేజీలో తనకు సీటు వచ్చింది. చింతగూడగు చెందిన బానావత్ తిరుపతి, సుమలత దంపతుల పెద్ద కుమారుడైన వినీత్ చిన్నప్పటి నుంచి ఎంతో చురుగ్గా చదువుకుంటూ మంచి మార్కులు సాధించాడు. అతను ఒకటి నుంచి 5వ తరగతి వరకు మండలంలోని జయారాణి హైస్కూల్లో చదివి, ఆ తర్వాత కాగజ్‌నగర్‌లో నవోదయలో 6 నుంచి 10వ తరగతి, ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు కాలేజీలో చదివి నీట్ రాసి ర్యాంకు పొందాడు. ఈ మేరుకు కౌన్సిలింగ్ ద్వారా ఎంబీబీఎస్ సీట్లు కేటాయించగా, అతనికి పెద్దపల్లి జిల్లాలో కాలేజీలో సీటు కేటాయిం చారు. సందర్భంగా వారిని మండల అంబేత్కర్ యువజన సంఘం అధ్యక్షులు భరత్ కుమార్ కాసెట్టి లక్ష్మణ్, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు ముత్యం సతీష్, మామిడిపల్లి ఇందయ్యా మేకల మాణిక్యం, ఈ రుణాల గంగన్న, దుమల రమేష్, సత్యనారాయణ, రాజన్నలు వారిని పూలమాలలతో శాలువాతో సత్కరించారు.