మెక్‌స్వీనీపై వేటు

– చివరి రెండు టెస్టులకు ఆసీస్‌ జట్టు
మెల్‌బోర్న్‌ : యువ ఓపెనర్‌ నాథన్‌ మెక్‌స్వీనీపై ఆసీస్‌ సెలక్టర్లు వేటు వేశారు. భారత్‌తో మూడు టెస్టుల్లో 72 పరుగులే చేసిన మెక్‌స్వీనీ అంచనాలను అందుకోలేదు. భారత్‌పై పీఎం ఎలెవన్‌ తరఫున 107 పరుగులతో మెరిసిన 19 ఏండ్ల శామ్‌ కొంటాస్‌ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. గాయపడిన పేసర్‌ జోశ్‌ హాజిల్‌వుడ్‌ స్థానంలో జై రిచర్డ్‌సన్‌కు చోటు కల్పించారు. భారత్‌, ఆస్ట్రేలియా నాల్గో టెస్టు 26 నుంచి మెల్‌బోర్న్‌లో ఆరంభం కానుంది. ఆస్ట్రేలియా టెస్టు జట్టు : ఉస్మాన్‌ ఖవాజా, శామ్‌ కొంటాస్‌, మార్నస్‌ లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, ట్రావిశ్‌ హెడ్‌, మిచెల్‌ మార్ష్‌, అలెక్స్‌ కేరీ, జోశ్‌ ఇంగ్లిశ్‌, సీన్‌ అబాట్‌, వెబ్‌స్టర్‌, నాథన్‌ లయాన్‌, పాట్‌ కమిన్స్‌, స్కాట్‌ బొలాండ్‌, జై రిచర్డ్‌సన్‌.