
నవతెలంగాణ-బోడుప్పల్: బోడుప్పల్ నగర కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఎండీ అఫ్జల్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం నాడు నగర పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అఫ్జల్ కు నియామకపు పత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా అఫ్జల్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా నియమించినందుకు నేతలకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఎన్నికలలో మైనారిటీలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండేందుకు కృషి చేసి కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కష్టపడుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తోటకూర అజయ్ యాదవ్, బొమ్మకు కళ్యాణ్ కుమార్, నియోజకవర్గం బీ బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పొన్నం తరుణ్ గౌడ్, మాజీ ఎంపీటీసి తోటకూర అశోక్ యాదవ్, మహిళ కాంగ్రెస్ నేత ఆకుతోట గీతా రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అసర్ల బీరప్ప తదితరులు పాల్గొన్నారు.