మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడిగా ఎండీ ఫకృద్దీన్

నవతెలంగాణ-పెద్దవంగర:
కాంగ్రెస్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడిగా ఎండీ ఫకృద్దీన్ (జానీ) నియమితులయ్యారు. మహబూబాబాద్ డీసీసీ అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఖలీల్ అహ్మద్ చేతుల మీదుగా సోమవారం ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పాలకుర్తి గడ్డపై మామిండ్ల యశస్విని ఝాన్సీ రెడ్డి గెలుపే లక్ష్యంగా సమన్వయంతో పని చేస్తామని చెప్పారు. తన నియామకానికి సహకరించిన డీసీసీ అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి, హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఖలీల్ అహ్మద్, సీనియర్ నాయకులు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు.