
పిల్లాయిపల్లి కాల్వలోకి గోదావరీ జలాలు అందించాలని,సాధన కోసం ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ అన్నారు. గురువారం పంతంగి గ్రామంలో ఇంటింటికి సీపీఐ(ఎం) విరాళాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ పోచంపల్లి,చౌటుప్పల్ మండల ప్రాంత ప్రజలు మూసి నీటితో వ్యవసాయం చేస్తున్నారని. మూసి విషపు నీరు అని తెలిసిన గత్యంతరం లేక అవే నీటితో వ్యవసాయం ఇతర పనులు చేసుకుంటున్నారు అని అన్నారు. అదేవిధంగా మూసీ నీటితో పోచంపల్లి,చౌటుప్పల్ ప్రాంత ప్రజలు సాగు చేస్తున్నా బస్వాపూర్ రిజర్వాయర్ లింకు కాల్వ ద్వారా పిల్లాయిపల్లి కాల్వలోకి గోదావరి జలాలను అందిస్తే ఈ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన సాగునీరు అందుతుందని అన్నారు. చౌటుప్పల్ ప్రాంత ప్రజల ఒకవైపు పరిశ్రమల కాలుష్యం తో, మరోవైపు మూసి కాలుష్యంతో కాలుష్య జీవితాలు గడుపుతున్నారని మూసీ ప్రక్షాళనకు పాలకులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. నూతన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మూసీపై సమగ్రమైన అంచనా వేసి అధ్యయనం చేసి చౌటుప్పల్ ప్రాంతాన్ని కాలుష్య రహిత ప్రాంతంగా చేయాలని ఎండి.జహంగీర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి గంగదేవి సైదులు DYFI జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ మండల కార్యదర్శివర్గ సభ్యులు చీరిక సంజీవరెడ్డి పంతంగి శాఖ కార్యదర్శి అంతటి అశోక్ గౌడ్ మండల నాయకులు చీరిక అలివేలు,రత్నం శ్రీకాంత్, సిద్దగొని శ్రీకాంత్,రొడ్డ భగత్ తదితరులు పాల్గొన్నారు.