నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
దండు మల్కాపురం గ్రామంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశం సోమవారం మల్కాజ్గిరి నరసింహ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా జిల్లా కమిటీ సభ్యులు ఆదిమూలం నందీశ్వర్ విచ్చేసి మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికులు రోజువారీగా పని చేస్తున్నటువంటి సందర్భంలో రూ.1 లక్ష రూపాయల సరుకులు కొనుగోలు చేస్తున్నారు.ఈ సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు టాక్స్ రూపంలో జీఎస్టీ రూపంలో రూ.3000 రూపాయలు టాక్స్లు పోతున్న భవన నిర్మాణ కార్మికులకు సమగ్ర శాసనం తీసుకురావటంలో సవతి తల్లి ప్రేమ వహిస్తున్నాయి.తెలంగాణ వస్తే నీరు,నిదులు నియామకాలు వస్తాయని చెప్పినటువంటి గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం గానీ మాటలు మాటలకు మాటలుగానే మిగలడం జరిగిందనీ సిఐటి జిల్లా ఉపాధ్యక్షుడు పేర్కొన్నారు.బోర్డు లో పేరు నమోదు కార్యక్రమము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సులువుగా జరిగేటటువంటి పనులు కంప్యూటర్ నెట్ సిస్టం పెట్టి మీ సేవలో పేరు తెలుసుకోండి అని చెప్పటం వల్ల కార్మికులు కూలి నాలి చేసుకోకుండా మీ సేవలో చుట్టూ తిరుగుతూ విస్కీ వేసాడుతున్నారనీ తెలిపారు.ఇటువంటి తరుణంలో ప్రభుత్వమే ఫిజికల్ గా అర్హులైన వారికి వెల్ఫేర్ బోర్డు కార్డులు ఇవ్వాలని పెన్షన్ 60 ఏళ్లు పైబడిన వారికి 7500 ఇవ్వాలని పిల్లలకు విద్యా వైద్యం కుటుంబానికి ఒకరికి చదువుకున్న వారికి ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మల్కాజ్గిరి నరసింహ ఉపాధ్యక్షులు బద్దుల మల్లయ్య ఉపాధ్యక్షులు మల్కాజిగిరి గిరి వర్ధన్ కమిటీ సభ్యులు చిలువేరు బిక్షపతి సిహెచ్ లింగస్వామి బద్దుల నరసింహ దౌడీ యాదగిరి మల్కాజిగిరి అంజయ్య బోయ తిరుమలేష్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది.