సీఐటీయూ జాతీయ సమ్మెను విజయవంతం చేయాలని ఇతర రాష్ట్రాల కార్మికులను కోరిన ఎండి పాషా

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండల పరిధిలోని ఎస్.లింగోటం గ్రామంలో జియో ఫాస్ట్ కంపెనీ ముందు కార్మికులకు ఆదివారం దేశవ్యాప్త కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ హిందీ కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు క్యాజువల్ డైలీ వే జి కార్మికులకు 12 గంటలకు పని చేయించుకుని తక్కువ వేతనం రూ.10,000 నుండి రూ.13 వేల వరకు ఇస్తున్నారన్నారు. సుదూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి కార్మికులకు స్థానిక పరిశ్రమల్లో ఈఎస్ఐ,పీఎఫ్ లేకుండా వారాంతపు సెలవులు, భీమా సౌకర్యం లేకుండా పనీ  చేయించుకుంటున్నారన్నారు. వీటన్నిటి పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా కార్మిక వర్గం కన్నరజేసి అన్ని ట్రేడ్ యూనియన్లు కలిసి బిఎమ్ఎస్ మినహా దేశవ్యాప్త సమ్మె నిర్వహించుచున్నది. ఈ సమ్మెను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా పని చేస్తున్నటు వంటి కార్మిక వర్గానికి రూ.26 వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని ఈఎస్ఐ,పీఎఫ్ భీమా సౌకర్యం కల్పించాలని వారాంతరపు సెలవులు ఇవ్వాలని ఎండి పాషా డిమాండ్ చేశారు.ఈ నెల 16న జరిగే దేశవ్యాప్త కార్మిక లోకం సమ్మెను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఆదిమూలం నందీశ్వర్, బత్తుల దాసు కార్మికులు పాల్గొన్నారు.