
చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామంలో సీఐటీయూ రాజకీయ శిక్షణ తరగతుల వాల్ పోస్టర్లను గురువారం సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి పాషా విడుదల చేశారు. ఈ రెండు రోజుల క్లాసులలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న అటువంటి కార్మిక వ్యతిరేక విధానాల్లో కార్మికులు చేస్తున్నటువంటి 8 గంటల పని దినాన్ని 12 గంటలకు మార్చటం కార్పొరేట్ శక్తులు అనుకూలంగా ప్రభుత్వాలు మారడం శోచనీయమన్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా, ట్రాన్స్పోర్ట్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు కొంతం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలోని రాసిపాడు కార్మికులు అంగన్వాడీలు స్కూల్స్ స్వీపర్లు, గ్రామపంచాయతీ కార్మికులు మున్సిపల్ కార్మికులు భవనిర్మాణ కార్మికులు అనుకున్న ఢిల్లీ ప్రకారంగా 27వ తేదీ నాడు 10 గంటలకు సీఐటీయూ జెండా ఆవిష్కరణ జరుగుతున్న తరుణంలో టైం పాటించి రాగలరని కార్మిక వర్గాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భవనాలు కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు జిల్లా కమిటీ సభ్యులు బొడ్డు పరమేష్.బీ రోజా, వంగూరు శీను,రాజు,వెంకటేశం,బాలయ్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు.