ఈద్గాల వద్ద వసతులు కల్పించండి: ఎండీ.యాకూబ్ పాషా

నవతెలంగాణ – పాల్వంచ 
ఈ నెల 17వ తేదీన బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గా, మసీదుల వద్ద తగు సౌకార్యాలు కల్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా గురువారం ఒక ప్రకటనలో అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా సుమారు 160 మసీదులు, 20 వరకు ఈద్గాలు ఉన్నాయని, బక్రీద్ పండుగను పురస్కరించుకుని, “ఈద్ ఉల్ జుహా ” నమాజ్ ను ఆచరించటానికి ఈద్గా, మసీదుల వద్ద వందలాది మంది ముస్లింలు హాజరవుతారని, శానిటైజేషన్, మంచి నీరు, టెంట్లు, షామియానాలను ఈద్గా, మసీదుల వద్ద ఏర్పాటు చేయాలని మున్సిపల్, మండల అధికారులను కోరారు.