మధ్యాహ్నం భోజనం కార్మికులకు పెండింగ్ లో ఉన్న ఐదు నెలల వేతనాలు వంట,గుడ్లు బిల్లులు వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ఎంఈఓ కార్యాలయం ముందు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వింత పత్రాన్ని ఎం.సీ.ఓ మహబూబ్ కు అందజేశారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ ఉపాద్యాయులు మాదిరిగానే మధ్యాహ్న భోజన కార్మికులకు సైతం వేసవి సెలవుల్లో నూ వేతనాలు చెల్లించాలని,రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టో లో పెట్టిన విధంగా రూ.10 వేలు వేతనం ఇవ్వాలని,పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగ దుర్గ, సీత, యామిని, మహాలక్ష్మి, పద్మ, విజయ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.