నాకు నేను…

నాకు నేను...నాకు నేను నేస్తం,
బాధ కలిగినపుడు ఓదార్పు కోసం

నాకు నేను ప్రాణం,
ఉసురు తీసుకునేంత బాధకలిగినపుడు

నాకు నేను ఊపిరి,
జీవితం శల్యంలా అనిపించినపుడు

నాకు నేను ఓదార్పు,
విపరీతమైన దుఖః కలిగినపుడు

నాకు నేను మందు,
మనసు గాయపడినపుడు

నాకు నేను అమ్మ
ఓదార్పు అవసరమైనపుడు
నాకు నేను నాన్న
కష్టంలో నాకు తోడు అవసరమైనపుడు
నాకు నేను అన్నీ అయినపుడు ఇంక ఎందుకు నీతో ”పని”?
– ఇందు కావ్య, 7396175177