– కేంద్రాన్ని ప్రశ్నించిన ఎన్‌హెచ్‌ఆర్‌సి
భువనేశ్వర్ : పాము కాటుతో సంభవిస్తున్న మరణాలపై, వాటిని నివారించేందుకు తీసుకుంటున్న చర్యలపై సవివరమైన నివేదికను అందచేయాల్సిందిగా జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) కేంద్ర, ఒడిషా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలను ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఏటా 58 వేలకు పైగా పాము కాటు మరణాలు నమోదవుతున్నాయని, వారిలో చాలామంది బాధితులకు సరైన నష్టపరిహారం కూడా అందడం లేదని పేర్కొంటూ మానవ హక్కుల లాయర్ రాధాకాంత్ త్రిపాఠి ఎన్‌హెచ్‌ఆర్‌సిని ఆదేశించారు. కోచింగ్ తరగతుల్లో నిద్ర పోతుండగా, పాము కాటుతో మృతి చెందిన విషయాన్ని త్రిపాఠి కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. కియోంజార్, కటక్ జిల్లాల్లో ఈ మరణాలు సంభవించాయి. ఒడిషాలో అన్ని విపత్తులకు సంబంధించిన మరణాల్లో పాము కాటు మరణాలు 40 శాతానికి పైగా వున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాము విషానికి విరుగుడు మందులు వుండకపోవడం ఇందుకు ప్రధాన కారణమన్నారు. ప్రపంచవ్యాప్తంగా నమోదైన పాము కాటు మరణాల్లో సగానికి సగం మరణాలు భారత్‌లోనే సంభవిస్తున్నాయన్నారు.