రైతుల రుణమాఫీని అందరికీ వర్తించేలా చర్యలు తీసుకోవాలి…

నవతెలంగాణ: రెంజల్
రైతుల రుణమాఫీ కొంతమంది రైతులకే పరిమితం చేశారని ప్రతి రైతుకు రుణమాఫీ అందాల చర్యలు తీసుకోవాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నాయకులు శుక్రవారం బోధన ఆర్డిఓ రాజా గౌడ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల రుణమాఫీ కోసం రైతులు చెప్పులు అరిగేలా బ్యాంకుల చుట్టూ తిరిగిన తమకు రుణమాఫీ కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారని వారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చిన్న సన్నకారు రైతుల విషయంలో ఎలాంటి వివక్షత చూపకుండా ప్రతి ఒక్కరికి రుణమాఫీ వచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా నాయకులు పుట్టినడిపి నాగన్న, జిల్లా కార్యదర్శి  గుమ్ముల గంగాధర్, సుల్తాన్, గోపాల్, హనుమాన్లు, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.