దోమల నివారణకు చర్యలు చేపట్టాలి

Measures should be taken to prevent mosquitoesనవతెలంగాణ – డిచ్ పల్లి
దోమలు  పుట్టకుండా కుట్టకుండా చూడాలని,లార్వా నివారణ కొరకు టి మో ఫాస్ & దోమల నివారణ కొరకు పైరిత్రిం స్ప్రే చేపట్టాలని, గ్రామాల్లో డెంగ్యూ వ్యాధి నివారణ కొరకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని మండల ఆరోగ్య విస్తరణ అధికారి వైశంకర్ శనివారం ఇందల్ వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో డిచ్ పల్లి, ఇందల్ వాయి మండలాల పరిధిలోని నక్కల గుట్టా, ఇందల్ వాయి లో జాతీయ కీటక జనిత వ్యాధులైన మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ , చికెన్ గున్యా  లాంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణ చర్యలు పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలని, పూల కుండీలలో పాత టైర్లలో కొబ్బరి చిప్పలలో తొలగించాలని తెలిపారు. నీరు నిలవ గల ప్రాంతాలలో గుర్తించి గ్రామ కార్యదర్శికి నివేదిక సమర్పించాలని ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. నీరు నిలువగల ప్రాంతాలలో ఆయిల్ బాల్స్ వదలాలని గ్రామ కార్యదర్శికి తెలియజేశారు. అలాగే మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్లో జాతీయ కీటక జనిత వ్యాధులపై అవగాహన  కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో  ఆరోగ్య పర్యవేక్షకులు దేవపాల, ఆరోగ్య సిబ్బంది సాయి వీర కుమారి,రాధిక, శోభ,సుజాత, ఎం.ఎల్.హెచ్.పి డాక్టర్ సుజాత ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.