– సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో విషజ్వరాల నివారణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులు వర్షాలు కురుస్తున్నాయని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని జిల్లాల్లో డెంగీ, మలేరియా వంటి విషజ్వరాలు విజృంభిస్తున్నాయని వివరించారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో రోగులు కిక్కిరిసిపోతున్నాయని పేర్కొన్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అక్కడక్కడా మరణాలు కూడా సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.