జన్నారం మండలంలోని రేండ్లగూడ గ్రామంలో నీటి సమస్య తలెత్తకుండా అన్ని బోర్లకు మరమ్మతులు చేయిస్తున్నామని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ వెల్లడించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం ఉదయం ఆ గ్రామంలోని పలు కాలనీల్లో పాడైన బోర్లను పంచాయతీ కార్మికులతో బాగు చేయించారు. అలాగే అన్ని కాలనీల్లో చెత్తను ఎప్పటికప్పుడూ ఊరు శివారుకు తరలిస్తున్నామని, ప్రజలు ఇళ్ల పరిసరాల పరిశుభ్రతను పాటించాలని శ్రీనివాస్ సూచించారు.