– మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ
– వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారం ప్రారంభం
– రూ.104 కోట్లతో ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో నిర్మాణం
నవతెలంగాణ – పటాన్‌చెరు
తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుతో పాటు కాలుష్య నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామికవాడలో రూ.104.24 కోట్లతో ప్రభుత్వ, ప్రయివేట్ భాగ స్వామ్యంతో నిర్మించిన వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారం (జీరో లిక్విడ్ డిశ్చార్జ్ కామన్ ఇంప్లిమెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్)ను శనివారం రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావే శంలో మంత్రులు మాట్లాడుతూ..పారిశ్రామిక రంగం లో ప్రభుత్వం, యాజమాన్యాలు తోడ్పాటు అందిం చుకుంటేనే అభివృద్ధి సాధ్యపడు తుందన్నారు. పాశమైలారం పారిశ్రామికవాడలో పారిశ్రామికవేత్తలు సొంతంగా ఏర్పాటు చేసిన 3 ఫైర్ స్టేషన్‌లను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని అదనపు సిబ్బందిని నియమించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్న వారి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ పరిశ్రమల సహకారం, కాలుష్య నియంత్రణ మండలితో ఒప్పందం కుదుర్చు కుని వ్యర్థ జలాల శుద్ధి ప్లాంట్‌ను రాంకీ సంస్థ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పారిశ్రామిక వాడలో మొట్టమొదటి ఇలాంటి ట్రీట్మెంట్ ప్లాంట్ నెలకొ ల్పడం గర్వకారణమని, మ్యాన్ పవర్ స్కిల్ డెవలప్ మెంట్ చేసి అందిస్తామన్నారు. కాలుష్య నియంత్రణ ను సామాజిక బాధ్యతగా తీసుకొని ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. పరిశ్రమలకు కేటాయిం చిన స్థలాల్లో కమర్షియల్ నిర్మాణాలు చేపడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, వాటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ పట్ల తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న పారిశ్రా మికవేత్తలను అభినందించారు. ఈ పారిశ్రామిక జోన్‌లో కీలకమైన శ్రామిక శక్తి సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని, పారిశ్రా మిక రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం తరఫున తోడ్పాటు ఉంటుందని చెప్పారు. పాశమైలారం హైలా చైర్మెన్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. ప్రభు త్వం, పారిశ్రామిక రంగం భాగస్వామ్యంతో రాంకీ సంస్థ ఈ ట్రీట్మెంట్ ప్లాంటు ఏర్పాటు చేసినట్టు చెప్పా రు. ఒక చుక్క వ్యర్థ జలాలను కూడా భూమి లోకి వదలకుండా శుద్ధిచేసి మళ్లీ పారిశ్రామిక వినియోగం కోసం వాడటం ఈ ప్లాంట్ ప్రత్యేకత అన్నారు. సు మారు 70 పరిశ్రమల నుంచి వ్యర్థ జలాల శుద్ధీకరణ కోసం ఈ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు వస్తాయన్నారు. కార్య క్రమంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్, టీఎస్ ఐఐసీ సీఈవో మధుసూదన్, చీఫ్ ఇంజినీర్ శ్యాం సుందర్, జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, రాంకీ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ రెడ్డి, వైస్ చైర్మెన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఐలా ప్రతినిధులు పాల్గొన్నారు.