రష్యాను మరింత కట్టడి చేసే చర్యలు

ప్రకటించిన జి-7 నేతలు
– హిరోషిమా అణు స్మారకం వద్ద నివాళి ఘటించిన నాయకులు
హిరోషిమా: రష్యాపై కొత్తగా ఆంక్షలు విధించేందుకు జి 7 దేశాలు శుక్రవారం అంగీకరించాయి. రష్యాకు యుద్ధానికి సహకరిం చగల సాంకేతికతలు, పారిశ్రామిక పరికరాలు, సేవలపై మరిన్ని కఠినమైన ఆంక్షలను విధించ నున్నట్లు తెలిపాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభమై 15మాసాలైన నేపథ్యంలో మాస్కో ను మరింత కట్టుదిట్టం చేసేందుకు తాజా చర్యలు చేపడుతున్నట్లు అమెరికా, బ్రిటన్‌, యురోపియన్‌ యూనియన్‌లు ప్రకటించిన తరుణంలో ఈ ప్రకటన వెలువ డింది. జి-7 ఆర్థిక వ్యవస్థలను రష్యా ఉపయోగించు కునే అవకాశాలను మరింత నియంత్రించాలని భావిస్తున్నట్లు జి-7 తెలిపింది. రష్యా దాడికి కీలకమైన ఉత్పత్తుల ఎగుమతులన్నింటినీ జి 7 దేశాల వ్యాప్తంగా నియంత్రించేందుకు మరింత విస్తృతంగా చర్యలు తీసుకుంటున్నట్లు జి 7 దేశాల నేతలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాంకేతికతలు, పారిశ్రామికోత్పత్తులు, సేవలు ఇలా యుద్ధానికి అవసరమైన వాటన్నింటినీ రష్యాకు అందకుండా చేయాలన్నది తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రస్తుత మున్న ఆంక్షల వ్యవస్థనుండి తప్పించు కోకుండా నివారించ డానికి కూడా తాము చర్యలను కట్టుదిట్టం చేయ నున్నట్లు తెలిపారు. అంతకుముందు అమెరికా సహా జి 7 దేశాలు తాము స్వంతంగా తీసుకునే చర్యలను ప్రకటించాయి. రష్యా, ఇతర దేశాలకు చెందిన మరో 70 సంస్థలను అమెరికా బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టనున్నట్లు అమెరికా సీనియర్‌ ప్రభు త్వాధికారి వెల్లడించారు. అలాగే రష్యాతో జరిగే వజ్రాల వ్యాపారాన్ని బ్రిటన్‌ లక్ష్యంగా చేసు కుంది. రాగి, అల్యూమినియం, నికెల్‌తో పాటూ రత్నాల దిగుమతులపై నిషేధం విధించను న్నట్లు ప్రకటించింది. రష్యాలో దొరికే, ఉత్పత్త య్యే లేదా ప్రాసెసయ్యే వజ్రాలను వినియో గించడం, వాటి వ్యాపారం ఆంక్షలు విధిస్తున్నట్లు జి 7 ప్రకటన పేర్కొంది. చర్చలు ప్రారంభానికి ముందుగా జి 7 దేశాల నేతలు హిరోషిమా నగరంలోని శాంతి పార్క్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ జపాన్‌ ప్రధాని ఫ్యుమియో కిషిదా వారికి స్వాగతం పలికారు. ఆనాటి అణు దాడిలో అశువులు బాసిన లక్షలాదిమందికి గుర్తుగా ఏర్పాటు చేసిన స్మారక స్థూపం వద్ద నేతలు నివాళి ఘటించారు.