పశు సంపద పెరుగుదలకు చర్యలు

నవతెలంగాణ-జోగిపేట
పశు సంపద పెరుగుదలకు చర్యలు తీసుకుంటు న్నామని మెదక్‌ జిల్లా పశు గణాభివద్ధి సంస్థ ఈవో డాక్టర్‌ కొండల్‌ రెడ్డి అన్నారు. ఆందోల్‌ మండలంలోని కోడెకల్‌ గ్రామంలో ఉమ్మడి మెదక్‌ జిల్లా పశుగణాభివద్ది సంస్థ, పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో పాడి పశువులకు ఉచిత వైద్య శిబిరాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాడిరైతులు సకాలంలో పశువు ఎద లక్షణాలను గుర్తించి, కత్రిమ గర్భాదారణ చేయించాలన్నారు. జన్మించిన లేగదూ డలకు సకాలంలో నట్టాల నివారణ మందులు వేయించాల న్నారు. పశువులకు గర్భస్రావం కావడానికి గల కారణాలను, పశువులు బలహీన పడకుండా మందులు తాగించాల న్నారు. లేగ దూడలు జన్మించిన 7, 15వ రోజులలో నట్టల నివారణ మందులు తాగిస్తే.. దూడలు ఆరోగ్యాంగా ఉండడమే కాకుండా రైతులకు నష్టం జరగకుండా ఉంటుం దన్నారు. నేటి దూడలే రేపటి పాడి పశువులు అని అన్నారు. రైతులందరూ మేలుజాతి దూడలకోసం పశువులకు కత్రిమ గర్భాదారణ చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాదులాపూర్‌ పశువైద్యశాల డా.సంధ్య, గోపాలమిత్ర సూపర్వైజర్‌ అర్జునయ్య, విఏ అనీషా బేగం, గ్రామ పెద్దలు నర్సింహారెడ్డి, గోపాలమిత్రలు కె.ఆర్‌.ప్రభు, నాగరాజు, శంకర్‌, యాదయ్య, మాణిక్యం రైతులు పాల్గొన్నారు.