నవతెలంగాణ – అశ్వారావుపేట
గుమ్మడవల్లి పీహెచ్ సీ పరిధిలోని చెన్నాపురం, చెన్నాపురం కాలనీ, కంట్లం,గోపన్నగూడెం గ్రామాల్లో దోమలు మందు పిచికారిని స్థానిక సర్పంచ్ గొంది లక్ష్మణరావు ప్రారంభించారు. 277 గృహల్లో మొదటి విడత పిచికారి చేశారు. పీ.హెచ్.సి వైద్యులు మధులిక ఆదేశాల మేరుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మురికి నీరు నిల్వ వల్ల దోమలు పెరిగి డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాలు వస్తాయని, సీజనల్ వ్యాధులు, దోమ తెరలు వినియోగం పై గిరిజనులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కృష్ణయ్య, విజయ రెడ్డి, వెంకటేశ్వర్లు, రాధా బాయి, స్వరూప, ఆశాలు పాల్గొన్నారు.