– కార్పొరేటర్ సామల హేమ
నవతెలంగాణ-ఓయూ
కరెంటు బిల్లుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ సామల హేమ అన్నారు. ప్రజా పరిపాలనలో కరెంట్ బిల్లులు పేరుతో ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని డివిజన్ పరిధిలో కొంతమంది కార్పొరేటర్ దృష్టికి తీసుకపోయారు. ఆదివారం బోనాల పండుగ ఉన్న సందర్భంలో కరెంటు బిల్లు ముక్కు పిండి వసూలు చేస్తున్నారని.. వారం రోజులు గడువు ఇవ్వండి అని అడిగిన లెక్కచేయకుండా కరెంట్ అధికారులు కరెంట్ కట్ చేసి వెళుతున్నారని తెలిపారు. కరెంటు బిల్లులో సగం అమౌంట్ కడతామని బతిమాలిన పార్సిగుట్ట ఏఈ వినటం లేదని వాపోయారు. బాధితులు సీతఫలమండి డివిజన్‌లోని పార్సిగుట్ట, శ్రీనివాస్ నగర్, సీతాఫల్మండి ప్రాంతంలో రెండు మూడు నెలల్లో అధిక మొత్తంలో కరెంటు బిల్లు రావడంతో ఒకేసారి కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. దాంతో కార్పొరేటర్ సంబంధిత అధికారులతో మాట్లాడగా పభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయని అధికారులు చెప్పా రు. కార్పొరేటర్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 3 నెలల పాటు అధికారులు ప్రజల దగ్గర నుండి ఎలాంటి దరఖాస్తులు స్వీకరించలేదని దీనివల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు. డిసెంబర్ నుండి 200 యూనిట్లు ఉచిత కరెంట్ అని చెప్పి ఇప్పుడు కొత్తగా ఆన్‌లైన్ చేసుకున్న వారికి మాత్రమే 200 యూనిట్లు ఉచిత కరెంట్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది ఇలాగే కొనసాగితే ప్రజల తరుపున పొరడానికి కార్యాచరణ రూపొందించుకుంటం అని తెలిపారు. విద్యుత్ అధికారి సమస్యను పరిష్కరించాలని కోరారు.
బోనాల పండుగ ఏర్పాట్లు పరిశీలన
సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ చిలకలగూడ శ్రీ కట్ట మైసమ్మ పోచమ్మ ఆలయంలో ఆదివా రం జరిగే బోనాల పండుగ ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చర్యలు తీసుకో వాలని అధికారులను ఆదేశించారు. అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్టు తెలిపారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో సమీక్షలు చేశామని ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వ యం చేసుకొని బోనాల పండుగను విజయవంతంగా పూర్తి చేసి అమ్మవారి కృపకు పాత్రులు అవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ ఏఈ కౌశిక్, ఆలయ ఈవో మహేందర్, బీఆర్‌ఎస్ నాయకులు కరాటే రాజు,సాయి యాదవ్,మురళీ పాల్గొన్నారు.