
మండలంలోని కంచర్ల గ్రామంలో నీటి సమస్యతో బాధపడుతున్న గ్రామ ప్రజల ఇబ్బందులను గుర్తించి పంచాయతీ కార్యదర్శి స్వప్న శుక్రవారం నీటి సమస్యను పరిష్కరించారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున గ్రామంలో ఫ్లెక్సీలను, శిలాఫలకాలను మూసి వేశారు. గ్రామ ప్రజలు గ్రామంలోని సమస్యలను గ్రామపంచాయతీలో తెలియజేయాలని గ్రామస్తులకు సూచించారు.