ఉత్తరాఖండ్ లో మెచ్చా పుట్టిన రోజు వేడుకలు..

– అభిమానం చాటుకున్న ఎంపీపీ జల్లిపల్లి..
నవతెలంగాణ – అశ్వరావుపేట
అశ్వారావుపేట మాజీ శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వర రావు జన్మదినం వేడుకలను ఆదివారం ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి ఉత్తరాఖండ్ లో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్,ఏలూరు జిల్లా,జీలుగుమిల్లి మండలం మక్కినవారిగూడెం కు చెందిన రామ సత్యవతి ఆధ్వర్యంలో చార్ ధాం యాత్రలో ఉన్న ఎంపీపీ జల్లిపల్లి దేవభూమి ఉత్తరాఖండ్ శ్రీనగర్ లో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసారు. ఈ సందర్భంగా శ్రీనగర్ లోని అనాథ వృద్ధులకు బోజనాలు అందజేసారు. అధికారంలో ఉన్నప్పుడు గతం లో ఎవరూ చేయని అభివృద్ధిని చేసి తాగునీరు,రహదారులు సీసీ రోడ్లు నిర్మించి అశ్వారావుపేట నియోజక వర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో మాజీ శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వర రావు అగ్రభాగాన నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో  పాటు బోగవల్లి రాంబాబు,రాళ్ల బండ జగదీశ్వర్ రాజు, గోపాలకృష్ణ, సీమకుర్తి శివప్రసాద్, దమ్మపేట వాస్తవ్యులు పసుమర్తి విజయ కృష్ణ,పసుమర్తి మురళీకృష్ణ,సత్తుపల్లి హైదరాబాదు విజయవాడ జంగారెడ్డిగూడెం కర్ణాటక వాస్తవ్యులు తదితరులు పాల్గొన్నారు.