హీరో విశ్వక్ సేన్ తన రాబోయే చిత్రం ‘మెకానిక్ రాకీ’గా అలరించబోతున్నారు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈచిత్రాన్ని హై బడ్జెట్‌తో, భారీ కాన్వాస్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. గురువారం రాబోతున్న ఈ సినిమాకు లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ వుంటుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో విశ్వక్ సేన్ గన్, రెంచ్‌ను పట్టుకుని బ్యాడ్ యాస్ అవతార్‌లో కనిపించారు. మెకానిక్‌గా తన క్యారెక్టర్‌ని ప్రజెంట్ చేస్తూ, పోస్టర్‌లో ఓల్డ్ కార్స్ కూడా ఉన్నాయి. ‘విశ్వక్‌సేన్ ఇప్పటివరకు నటించిన చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా చాలా వైవిధ్యంగా ఉంటుంది. అలాగే ఆయన పాత్ర తీరు తెన్నులు సైతం ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేస్తాయి. ఈ సినిమా ఆయన కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్‌గా నిలిచిపోతుంది’ అని చిత్ర యూనిట్ తెలిపింది. కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోరు, డీవోపీ: మనోజ్ కటసాని, ప్రొడక్షన్ డిజైనర్: క్రాంతి ప్రియం, ఎడిటర్: అన్వర్ అలీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సత్యం రాజేష్, విద్యాసాగర్ జె, కాస్ట్యూమ్ డిజైనర్: కళ్యాణి, ప్రీతమ్ జుకల్కర్.